20 March, 2026 | 6:25 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య

20-03-2026 04:25 PM

సుల్తానాబాద్: తెలంగాణ సమగ్ర శిక్ష శిక్ష లో భాగంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు పట్టణ పోటీలు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల విద్యా వనరుల కేంద్రంలో శుక్రవారం  నిర్వహించారు, మొదట వివిధ పాఠశాలల నుండి క్లస్టర్ స్థాయిలో తెలుగు ఆంగ్ల భాషలలో పోటీలు నిర్వహింపబడి ప్రథమ ద్వితీయ స్థాయి ఎంపిక చేయడం జరిగింది , అనంతరం మండల స్థాయిలో వీరికి పట్టణ పోటీలు నిర్వహించబడినాయి, ఉచ్చారణ దోషాలు లేకుండా విరామ చిహ్నాలు ఉపయోగిస్తూ స్పష్టంగా హావభావాలతో చదివిన విద్యార్థులను ఎంపిక చేసినట్లు మండల విద్యాధికారి ఆరేపల్లి రాజయ్య  తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మండల స్థాయి తెలుగు జూనియర్ కేటగిరిలో ప్రధమ స్థానం బి హిమాన్షు ఎంపీపీ ఎస్ నీరుకుల్లా , ఆంగ్లంలో ఎం సాయి సమీరా ఎంపీపీ ఎస్ నీరుకుల్లా ప్రధమ స్థానాలలో నిలిచారు, అదేవిధంగా మూడో నాలుగు ఐదవ తరగతుల రెండవ కేటగిరిలో సిరివెన్నెల ఎంపీపీ ఎస్ అల్లిపూర్,  ఆంగ్లంలో ఎన్ వేద విలాసిని ఎంపీపీ ఎస్ తొగర్రాయి విద్యార్థులు మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది . మీరు జిల్లా స్థాయిలో జరిగే ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొంటారని తెలియజేయడం జరిగింది.ఈ పోటీలలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎస్ రత్నాకర్ రెడ్డి , దివాకర్,  డి ఆర్ పి ఆర్ కిరణ్ కుమార్ ,  మండల రిసోర్స్ పర్సన్స్ వి తిరుపతిరెడ్డి, అనిల్ కుమార్ ,మన్సూర్ ,  తుల సుధాకర్ రావు, జె వాణి,  వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సి ఆర్ పి  లు  వి. సదానందం, రామచంద్రం , వి. కిరణ్ పలువురు పాల్గొన్నారు.