1 July, 2026 | 9:15 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

జనవరి 7 నుంచి మహిళల ఐపీఎల్

18-11-2025 12:00 AM

ముంబై, నవంబర్ 17 : మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ వచ్చే ఏడాది జనవరి 7 నుంచి ప్రారంభం కానుం ది. షెడ్యూల్‌పై ఇంకా అధికారిక ప్రకటన రాకున్నప్పటకీ ముంబై, బరోడా వేదికలుగా ఈ మెగా టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం.లీగ్‌లో ఫస్టాఫ్ మ్యాచ్‌లకు ముంబైలోని డీవై పాటిల్ స్టేడి యం ఆతిథ్యమివ్వనుంది. ఇటీవలే ఈ స్టేడియంలో వరల్డ్‌కప్ ఫైనల్ జరిగింది. 

సెకం డాఫ్ మ్యాచ్‌లతో పాటు ఫైనల్స్‌ను బరోడాలోని కోటంబి స్టేడియంలో జరిపేందుకు బీసీసీఐ సన్నాలు చేస్తోంది. నవంబర్ 27న న్యూఢిల్లీ మహిళల ఐపీఎల్ వేలం జరగనుండగా అప్పుడే దీనిపై బీసీసీఐ అధికారిక ప్రక టన రానుంది. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను కైవసం చేసు కుంది. 2025 సీజన్‌లో మ్యాచ్‌లకు వడోదర, బెంగళూరు, లక్నో, ముంబై ఆతిథ్యమి చ్చాయి. ఫిబ్రవరిలో పురుషుల టీ20 ప్రపంచకప్ ఉండడంతో ఒక నెల ముందుగానే డబ్ల్యూపీఎల్‌ను నిర్వహించబోతున్నారు.