20 June, 2026 | 6:20 PM

మారకద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాలపై ప్రతిజ్ఞ

20-06-2026 05:09 PM

చుంచుపల్లి,(విజయక్రాంతి): జిల్లా కేంద్ర గ్రంథాలయం భద్రాద్రి కొత్తగూడెం నూతన గ్రంథాలయంలో గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు  కలెక్టర్  ఆదేశానుసారం జిల్లా కేంద్ర గ్రంథాలయములో ని విద్యార్థిని విద్యార్థులు, పాఠకులతో మారకద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీలక భాగస్వామ్యాన్ని అవుతానని, వీటిని వాడటం వలన కలిగిన దుష్పరిణామాలను గురించి సంపూర్ణంగా అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకము కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని డ్రగ్స్ రహిత జీవనశైలి అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంతో భాగస్వామ్యం అవుతానని ప్రతిజ్ఞ చేశారు.