మానవత్వం చాటుకున్న పికెటింగ్ పోలీసులు
28-05-2026 11:49 AM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ పోలీసులు మానవత్వం చాటుకుని స్థానిక నిరుపేదల నుంచి అభినందనలు అందుకుంటున్నారు. బక్రీద్ సందర్భంగా ఖానాపూర్ పట్టణం శివారులో అంబేద్కర్ నగర్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఊషన్న, మనోజ్ ,రమేష్, నగేష్, తదితరులు అదే కాలనీకి చెందిన మగిడి రెడ్డి ఇల్లు మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇంటి పైకప్పు కొట్టుకుపోగా మానవత్వంతో స్పందించి నలుగురు కానిస్టేబుల్ లు గురువారం ఆ కుటుంబానికి టార్పోలిన్ లు అందించి సహాయం చేశారు. ఇది చూసిన అక్కడి స్థానికులు పోలీసులను అభినందించారు .ఈ కార్యక్రమంలో పశు వైద్య సంచాలకులు రామకృష్ణుడు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గొర్రె గంగాధర్ ,పలువురు ఉన్నారు.






