30 June, 2026 | 3:44 PM

అనుమతులు లేని పాఠశాలకు వత్తాసు పలుకుతున్న ఎంఈఓ టీజీవిపి

30-06-2026 02:54 PM

బోథ్: నేరడిగొండ మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న జ్ఞాన వికాస్ పాఠశాల నిర్వహణకు స్థానిక ఎంఈఓ వత్తాసు పలుకుతున్నా రని టీజీవిపి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొత్తూరుబోథ్ మండలంప్రవీణ్ విమర్శించారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని విద్యా హక్కు చట్ట ప్రకారం జాతీయ రహదారి 44 అత్యంత సమీపంలో ఉండకూడదన్నారు. జాతీయ రహదారికి సమీపంలో ఉండడం వల్ల విద్యార్థులకు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారు అన్నారు.పాఠశాలపై తక్షణమే చర్యలు తీసుకొని గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.