11 April, 2026 | 3:06 AM

అసమానతలపై ఫూలే పోరు

11-04-2026 12:57 AM
  1. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి కార్యక్రమంలో మాజీమంత్రి వీహెచ్
  2. బీసీ మేధావుల ఫోరం చైర్మన్ టీ చిరంజీవులుకు మహాత్మా జ్యోతిరావు ఫూలే ఎక్సలెన్స్ అవార్డు- 2026 ప్రదానం
  3. ఈ అవార్డుతో బాధ్యత పెరిగింది: చిరంజీవులు
  4. బీసీ సమాజాభివృద్ధికి కృషిచేస్తున్న వ్యక్తి చిరంజీవులు
  5. మాజీ డీజీపీ, ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త పూర్ణచందర్‌రావు
  6. ఫూలే జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం
  7. ఎమ్మెల్సీ మధుసూదనాచారి

ముషీరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): సమసమాజ స్థాపన కోసం కులప రమైన అసమానతలను రూపుమాపేందుకు విశేష కృషిచేసిన మహానీయుడు, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే అని పీసీస మాజీఅధ్యక్షుడు, మాజీమంత్రి వీ హనుమంతరావు పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జయంతి సందర్భంగా తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. 

సమాజంలోని అంటరానితనం,  కులవ్యవస్థ నిర్మూలనకు ఫూలే చేసిన కృషి అపారమని, ఆయన చూపిన మార్గంలో నేటి యువతరం ముందుకుసాగాలని సూచించారు. తెలంగాణ శాసనసభ తొలి సభాపతి, ఎమ్మెల్సీ సిరికొండ  మధుసూదనాచారి మాట్లాడు తూ, పేదల, శూద్రుల హక్కుల కోసం పోరాడిన ఫూలే జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, ఆయన జీవన విధానాన్ని అధ్యయనం చేసి ఆచరించాలని కోరారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజ్‌గౌడ్ మాట్లాడుతూ, బీసీలు ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించగలరని పేర్కొన్నారు. 

తెలంగాణ బీసీ మేధావుల ఫోరం రాష్ట్ర చైర్మన్ టీ చిరంజీవులు మాట్లాడుతూ, బీసీ ఐక్యత కోసం తన వంతు కృషి కొనసాగిస్తానని.. పోరాటాల ద్వారా హక్కులను సాధిం చేందుకు అన్నివర్గాలను ఒకే వేదికపైకి తీసుకువస్తానని అన్నారు. తాను రచించిన పుస్త కాలు, ప్రసంగాల ద్వారా వెనుకబడినవర్గాల్లో చైతన్యం తీసుకువచ్చి  మహాత్మా జ్యో తిరావు ఫూలే కలలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని అన్నారు.

తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డా.రాజ్ నా రాయణ ముదిరాజ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతిభావంతుడైన ఒక రికి ప్రదానం చేసే మహాత్మా జ్యోతిరావు ఫూలే ఎక్సలెన్స్ అవార్డు 2026కు ఈ సంవత్సరం బీసీ మేధావుల ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టీ చిరంజీవులును ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులంతా టీ చిరంజీవులు ను శాలువాలు, పూలమాలలు, జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో ఘనంగా సన్మానించి అవార్డును అందజేశారు. మాస్టర్ ఆఫ్ సెరిమనీ ప్రోగ్రాం అడ్వైజర్ డా.రవితేజ జ్యోతిరావు ఫూలే జీవిత విశేషాలను వివరిస్తూ, ఆయన సేవలను స్మరించారు.

అలాగే బీసీ సంక్షేమం కోసం కృషి చేస్తున్న నాయకులు గుజ్జ సత్యం, ఆర్ రవీందర్, కోరేళ్ల చంద్ర య్య, మహేష్‌కుమార్ ముదిరాజ్‌లను ఈ సందర్భంగా శాలువాలు పూ లమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముందు మహాత్మా జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వల నం చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీసీసీ కో ఆర్డినేటర్లు డా.సాయికిరణ్, జీ  వేణుగోపాల్, బిచ్చుకారి సూర్య, రామ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

ఫూలే కలలు నెరవేరలేదు

ఫూలే కలలు కన్న సామాజిక న్యాయం మరియు అణగా రిన వర్గాల సాధికారత ఇప్పటికీ నెరవేరలేదని మాజీ డీజీపీ, ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త పూర్ణచందర్ రావు తెలిపారు. ప్రజాస్వామ్యం ఉన్న ప్పటికీ రాజ కీయ వాటా జనాభా సంఖ్య ను ప్రతిబింబించడం లేదని ఆయన పేర్కొన్నారు. రెడ్డి, కమ్మ, వెలమ వంటి ఆధిపత్య కులా లు ఇంకా శాసనసభలు మరియు పాలనలో అధిక ప్రభావా న్ని కొనసాగిస్తుండగా, బీసీ లు.. ముస్లింలు తగిన సంఖ్యలో చట్టసభల్లో లేరని ఆయన తెలిపారు.

చదువు అనే ఆయుధంతో సా మాజిక గౌరవాన్ని సాధించడంలో ఫూలే ప్రేరణగా నిలిచారని, అదే మార్గంలో చిరంజీవులు బీసీ సమాజ అభివృద్ధికి కృషిచేస్తు న్నారని తెలిపారు. మేధావులు ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెట్టి కుల ఆధారిత రాజకీయ వెలివేతను పట్టించుకోలేదని  పూర్ణచందర్‌రావు విమర్శించారు. దీంతో నిర్మాణాత్మక అస మాన తలుకొనసాగుతున్నాయని, అధికారం కొద్ది మందిలోనే కేంద్రీకృతమైందని ఆయన అన్నారు.

ఈ అస మానతల వల్ల పాలసీలు కొద్దిమందికే అనుకూలంగా మారి, మెజారిటీ వర్గాలు రోజురోజుకీ వెనకబడుతున్నాయని ఆయ న పేర్కొన్నారు. ఆదివాసీలు భూహక్కులు, అటవీహక్కులు ఇంకా ఇతర సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారని, వివక్ష వల్ల ఎస్సీలకు రాజకీయ వాటా అందటంలేదని, బీసీలకు తగిన ప్రాతినిధ్యం లేదని.. ముస్లింలు సామాజిక-, ఆర్థికంగా వెనుకబడినస్థితిలో ఉన్నారని ఆయన వివరించా రు. అందరికీ ప్రాతినిధ్యం లేని ప్రజాస్వా మ్యం, కొద్దిమంది పాలనగా మారుతున్నదని పేర్కొన్నారు.

జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యం, కులగణన, అణగారినవర్గాల నాయకత్వ వికాసం అవసరమ ని ఆయన పిలుపునిచ్చారు. కుల అసమానతలపై మేధావులు స్పందించి సమగ్ర చర్చను ప్రోత్సహించాలని ఆయన కోరా రు. ఫూలే భావజాలం దానం కాదు, అధికార భాగస్వామ్యనికి దారి అని పూర్ణచం దర్‌రావు స్పష్టం చేశారు.

బహుజనులు సామాజిక, రాజకీయ చైతన్యంతో ముందు కు నడవాలని పిలుపునిచ్చారు. అన్యాయాన్ని సరిచేయడమే ఫూలేకు నిజమైన నివాళి అని అన్నారు. జనాభాను ప్రతిబింబించే విధంగా అధికార స్వరూపం లేనం తవరకు ప్రజాస్వామ్యం సంపూర్ణం కాదు అని ఆయన చెప్పారు. ఈ సమావేశం సమగ్ర, సమాన ప్రతినిధిత్వంతో కూడిన ప్రజాస్వామ్యాన్ని సాధించేందుకు కృషి చేయాలనే తీర్మానంతో ముగిసింది.