6 July, 2026 | 1:07 PM

Breaking News

సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •   7 ఎకరాలలోపు రైతులకు 'రైతుభరోసా' నిధులు విడుదల   •   ములుగు జిల్లాలో భారీ చోరీ   •   సాయి నగర్ మురికి కాలువ లో ముళ్ళ పొదల తొలగింపు   •   పారిశుద్ధ్యం... పంచాయతీ కేంద్రాల్లో అధ్వానం   •  

జహీరాబాద్ లో పీజీ సెంటర్ ఏర్పాటు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

21-04-2026 03:45 PM

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం సాగుతోంది

హైదరాబాద్: సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ(Congress Party Political Affairs Committee) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్ షెట్కర్ పాల్గొన్నారు. ప్రజలకు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం సాగుతోందని తెలిపారు. ఇటీవలే రూ. 200 కోట్లతో కొత్త ఆస్పత్రికి శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. జహీరాబాద్, నారాయణఖేడ్ ఆస్పత్రుల్లో పడకల సంఖ్య పెంచాలని వినతులు వచ్చాయని వెల్లడించారు. నారాయణఖేడ్ ఆస్పత్రిలో మరో 50  పడకలు మంజూరు చేస్తామన్నారు. జహీరాబాద్ లో పీజీ సెంటర్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ యోచన అన్నారు.