కామారెడ్డి జిల్లాలో పెట్రోల్ కొరత
పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు
ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
సకాలంలో డీడీలు చెల్లించకపోవడం వల్లే పెట్రోల్ రాలేదన్న ఆరోపణలు
కామారెడ్డి,(విజయక్రాంతి): పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు మాత్రమే డీజిల్ పెట్రోల్ కొరత ఏర్పడేది. ప్రస్తుతం గలుపు దేశాల్లో యుద్ధం జరిగినప్పుడు సైతం అందుబాటులో ఉన్న డీజిల్, పెట్రోల్ సోమవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పెట్రోల్ కొరత ఏర్పడింది. పెట్రోల్ కోసం వెళ్ళిన వాహనాదారులకు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఊహించని విధంగా పెట్రోల్ బంకుల్లో సాయంత్రం నో స్టాక్ బోర్డులతో వానదారులు పెట్రోల్ డీజిల్ కోసం ఇబ్బందులు పడ్డారు. పెట్రోల్ బంకుల యజమానులు డీడీలు చెల్లించడంలో ఆలస్యం జరగడం వల్లే పెట్రోల్, డీజిల్, కొడతా ఏర్పడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్యవేక్షించాలని అధికారులు పట్టించుకోకపోవడం వల్లే పెట్రోల్ బంకుల యజమానులకు ఆడిందే ఆట పాడిందే పాట వారి ఇష్టానుసారంగా డిడిలు చెల్లిస్తున్నారని వాహన దారులు ఆరోపిస్తున్నారు.
మరికొన్ని పెట్రోల్ బంకుల్లో వాన దారులకు పెట్రోల్ పోసేటప్పుడు మీటర్ రీడింగ్ లో ఒక తవకలు పాల్పడుతూ నిలువు దోపిడీకి గురి చేస్తున్నారని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంతో బంకు యజమాని తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.






