22 May, 2026 | 7:43 PM

Breaking News

ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •   వేతన పెంపు హర్షణీయం: మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్   •   కామారెడ్డి డిఆర్డిఓగా దామోదర్ రెడ్డి   •   దోమకాటు వ్యాధుల పట్ల... ప్రజలకు అప్రమత్తత అవసరం   •   సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదు   •  

ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి: డీఎస్పీ ప్రసన్నకుమార్

08-12-2025 06:11 PM

​నూతనకల్ (విజయక్రాంతి): మండల పరిధిలోని వెంకేపల్లి గ్రామంలో సోమవారం డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో ధైర్యాన్ని నింపేందుకు, శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు పోలీసులు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కవాతు చేశారు.​ ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో ఎలాంటి గొడవలు, వివాదాలు లేకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.​ ఈ కార్యక్రమంలో తుంగతుర్తి సీఐ నరసింహారావు, ఎస్సై నాగరాజు, ఏఎస్ఐ అరవింద్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.