22 May, 2026 | 8:00 PM

Breaking News

బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •  

సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదు

22-05-2026 07:03 PM

కాప్రా తహసీల్దార్ బైరెడ్డి రాజేశ్

జవహర్ నగర్,(విజయక్రాంతి): సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదని, కబ్జాదారులపై ప్రత్యేక దృష్టి పెట్టామని కాప్రా తహసీల్దార్ బైరెడ్డి రాజేశ్ హెచ్చరించారు. జవహర్నగర్లోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా వెలిసిన కట్టడాలను కాప్రా తహసీల్దార్ బైరెడ్డి రాజేశ్ ఆదేశాల మేరకు గిర్దావర్ సత్యనారాయణ సమక్షంలో శుక్రవారం ప్రగతినగర్, బీజేఆర్నగర్, కార్మికనగర్లోని నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నామని, ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాలను గుర్తించి ఇప్పటికే కంచెలు ఏర్పాటు చేశామన్నారు. నూతన నిర్మాణాలు ఎలాంటి చేయవద్దని, అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.