బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి
22-05-2026 07:26 PM
బోధన్,(విజయక్రాంతి): రుద్రూర్ మండల కేంద్రంలో ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (TUCI) బోధన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో బీడీ కార్మికులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.4000 పెన్షన్ అందజేయాలని శుక్రవారం ధర్నా నిర్వహించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం చేయూత పథకం ద్వారా వెంటనే ఈ మొత్తాన్ని చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అంగడి బజారు నుండి సమీకృత మండల కార్యాలయాల భవన సముదాయం వరకు ర్యాలీగా వచ్చి నిరసన తెలిపారు.






