కామారెడ్డి డిఆర్డిఓగా దామోదర్ రెడ్డి
22-05-2026 07:10 PM
కలెక్టర్ ను కలిసి పూల మొక్కను అందించిన డిఆర్డిఓ
కామారెడ్డి, మే 22 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా డిఆర్డిఓగా పనిచేసిన సురేందర్ బదిలీ కాగా ఆయన స్థానంలో రవీందర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. జిల్లా అభివృద్ధిలో తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని ఈ సందర్భంగా డిఆర్డిఓ రవీందర్ రెడ్డి తెలిపారు.






