పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలి
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): ఇప్పటివరకు టెండర్ ప్రక్రియ పూర్తయి పెండింగ్ లో ఉన్న పనులను వెంటనేపూర్తి చేయాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. సోమవారం సుడా అభివృద్ధి పనులు, నగర, పరిసర ప్రాంతాల సుందరీకరణ పనులు, తదితర అంశాలపై సుడా వైస్ చైర్మన్ ప్రఫుల్ దేశాయ్ తో కలిసి ఇంజనీరింగ్ అధికారులతో సుడా చైర్మన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంతో పాటు పరిసర గ్రామాల ప్రధాన రహదారులు జంక్షన్లు డివైడర్ల సుందరీకరణకు అధిక ప్రాధాన్యతనిస్తూ పనులకు రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన వర్టికల్ గార్డెన్లు,జంక్షన్ల సుందరీకరణ, పార్కుల పనులు వెంటనే ప్రారంభించాలని సూచించారు.
ఐడిఎస్‌ఎంటీ లో బ్యాలెన్స్ పనులు వారం రోజులలో పూర్తి చేయాలని, ఫుడ్ కోర్టు పనుల శంకుస్థాపనకు అన్ని ఏర్పాట్లు చేయాలని డివైడర్ల మద్యన పాట్స్ ఏర్పాటు చేసి వాటిలో రకరకాల పూల మొక్కలతో సుందరీకరణ చేయా లని సూచించారు. ఎన్టిఆర్ విగ్రహం కూడలితో పాటు నూతనంగా జంక్షన్ల సుందరీక రణ కు రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎస్‌ఈ రాజ్ కుమార్, ఈఈ శివానంద్, డిఈ ఏ.రా జేంద్ర ప్రసాద్, ఏఈలు పి.సతీష్, టి.సతీష్, వర్క్ ఇన్స్పెక్టర్ అజ్మల్, పాల్గొన్నారు.




