పెండింగ్ ఫైళ్లను పరిష్కరించాలి
కలెక్టర్ కుమార్ దీపక్
రామకృష్ణాపూర్, మార్చి 9 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులను కొనసాగిస్తూ కార్యాలయాలలో పెం డింగ్ పైళ్లను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 12 వరకుకార్యచరణ రూపొందించడం జరిగిందని, క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.
గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో 99 రోజుల పాటు కార్యచరణ అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని, ప్రభుత్వ కార్యాలయాలలో పెం డింగ్ లో ఉన్న పైళ్లనుపూర్తిగా పరిష్కరించాలన్నారు. అనంతరం క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో అమృత్ పథకంలో భాగంగా చేపట్టిన నీటి ట్యాంకు, ఇతర నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
12న అవగాహన కార్యక్రమం
నస్పూర్: ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీ, జీపీల ప్రజా ప్రతినిధుల కు ఈ నెల 12న అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం తెలిపారు. జిల్లాలోనీ అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్, ఉపసర్పంచ్ లకు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ లతో పాటు క్యాతనపల్లి, బెల్లంపల్లి, చెన్నూర్, లక్షెట్టిపేట మున్సిపాలిటీల చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లకు నిర్వహించనున్న అవగాహన కార్యక్రమానికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలన్నారు.




