10 March, 2026 | 4:04 AM

హెచ్‌పీవీ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి

10-03-2026 12:57 AM

కలెక్టర్ కె.హరిత పిలుపు

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): జిల్లాలో గర్భాశయ క్యాన్సర్ వం టి ప్రాణాంతక వ్యాధులను నివారించేందుకు 9 నుండి 14 సంవత్సరాల బాలికలకు హెచ్పీ వీ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం బాలికలకు ఉచితంగా అందిస్తున్న హెచ్పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.

ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కె. సీతారాం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాక్స్పి ఎటువంటి అపోహలు అవసరం లేద ని, 9 నుండి 14 సంవత్సరాల బాలికలు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలి పారు. దీని వల్ల భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చన్నారు.

జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.జిల్లా కేంద్రంలోని టీ-హబ్ మేనేజర్ విధులకు గైర్హాజరు అవుతున్నాడని ఆసుపత్రి సూపరింటెండెంట్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.  అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా ఆసుపత్రి మహిళా సిబ్బంది కలెక్టర్ను సన్మానించారు.

అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులతో నిర్వహిస్తున్న కళాజాత ప్రచార రథాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కళాకారులు తమ ప్రదర్శనల ద్వారా ప్రజలకు వ్యాధుల నివారణపై అవగాహన కల్పించాలని సూచించారు.అనంతరం ఈవీఎం గోదాం సందర్శించిన కలెక్టర్ యంత్రాలను భద్రపరిచిన గోదాం వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నామన తెలిపారు. 24 గంటల పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు.

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో ప్రజల నుండి హత్యలు స్వీకరించిన కలెక్టర్ ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డిఓ లోకేశ్వరరావు, డిఆర్డీవో బానోత్ దత్తారావు, డీడబ్ల్యూవో భాస్కర్, ఎన్నికల విభాగం అధికారులు, వైద్య సిబ్బంది, కళాకారులు, వివిధ రాజకీయ పార్టీ ల ప్రతినిధులు పాల్గొన్నారు.