21 July, 2026 | 11:18 PM

Breaking News

విద్యా ప్రమాణాల్లో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో అగ్రగామి

21-07-2026 02:23 AM

జిల్లా కలెక్టర్ హర్షతో పాటు విద్యాశాఖ అధికారులకు విశిష్ట సత్కారం

పెద్దపల్లి, జూలై 20 (విజయ క్రాంతి)విద్యా ప్రమాణాల పెంపులో పెద్దపల్లి జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపినందుకు జిల్లా కలెక్టర్ హర్ష తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారులకు విశిష్ట గౌరవం లభించింది.హైదరాబాద్లోని ఎల్.బి. స్టేడియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గౌరవ గవర్నర్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చేతుల మీదుగా జిల్లా విద్యాశాఖ అధికారి, ప్రణాళిక సమన్వయకర్త, నాణ్యత సమన్వయకర్త, మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు, ఉత్తమ విద్యా వనరుల వ్యక్తులు, ఉత్తమ శిక్షణ భాగస్వాములను ఘనంగా సన్మానించారు.

విద్యా రంగంలో మౌలిక వసతుల కల్పన, ఆన్లైన్ కార్యకలాపాల సమర్థ నిర్వహణ, నాణ్యతాభివృద్ధి, విద్యార్థుల అభ్యాస ఫలితాల మెరుగుదల, పాఠశాలల సమర్థ నిర్వహణలో పెద్దపల్లి జిల్లాను రాష్ట్రంలో ముందంజలో నిలిపినందుకు ఈ గుర్తింపు లభించింది.వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో ఈ సత్కారం జరగడం జిల్లా విద్యాశాఖకు గర్వకారణంగా నిలిచింది. ఈ విజయానికి కృషి చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యా రంగ భాగస్వాములందరికీ జిల్లా యంత్రాంగం అభినందనలు తెలియజేశారు.