11 July, 2026 | 8:11 PM

Breaking News

మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   బాన్సువాడ జామ మసీద్ నూతన అధ్యక్షునికి ఘన సన్మానం   •   బెజ్జంకిలో ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు   •   ఎస్‌ఐఆర్–2026ను పారదర్శకంగా నిర్వహించాలి   •   ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించటం గర్వకారణం   •   రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ ఆధ్వర్యంలో నోట్‌ బుక్స్ పంపిణీ   •   బిఆర్ఎస్ నేతలను అరెస్టు చేసిన పోలీసులు   •   సమయంలోపు ఎస్ఐఆర్ ఫాంలను అందించాలి: ఈఆర్ఓ ఎన్. జగదీశ్వర్ రెడ్డి   •  

ప్రశాంతంగా... మున్సి‘పోల్స్’

12-02-2026 12:00 AM
  1. 18 వార్డుల్లో 81శాతం పోలింగ్

పరిశీలించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి 

ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుదీర్ బాబు

చేవెళ్ల ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): కొత్తగా ఏర్పడిన చేవెళ్ల మున్సిపాల్ కు నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిసింది. మొత్తం ఓటర్లు - 25,371/- ఓటర్లు ఉండగా 20,531/- ఓట్లు పోలయ్యాయి. ఉదయం నుండి మందకోడిగా సాగిన పోలింగ్ ఓటింగ్ సమయం ముగిసేసరికి 80.92% (81శాంతం) పోలింగ్ జరిగింది. పురుషులు 12,579ఉండగా మహిళాలు,12,791 ఉంటే, అదర్స్ ఒక్కరు ఉన్నారు.

అయితే పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుదీర్ బాబు సందర్శించారు. పోలింగ్ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పడిన పూర్తి చేయగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసింది. ఫ్యూచర్ సిటీ  కమిషనర్ సుధీర్ బాబు 16,17,18, వార్డుల ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించారు.

ఓటింగ్ లో పాల్గొన్న 18 వార్డులకు గాను ఓటర్లు 81శాంతం ఓటింగ్లో పాల్గొన్నారు. అంకెల తారుమారు చేసి విలక్షణమైన ఓటింగ్ పర్సంటేజ్ని ఇచ్చారు. అయితే నామినేషన్లకు ముందు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆస్తులు అమ్ముకుంటున్నారన్న పుకార్లు వినిపించాయి. మొత్తం ఓట్లలోంచి  పోలైన ఓట్లు తీసేయగా 4,840 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేరు. ఓటు హక్కు వినియోగించుకొని ఓటర్ల సంఖ్య ఎకరం విస్తీర్ణంకు గజాల్లో మ్యాచ్ కావడం గమనార్హం.

మొత్తం ఓటర్లు - 25,371

పోలైన ఓట్లు - 20531

పోల్ కాని ఓట్లు - 4840

పోలింగ్ కేంద్రాలు - 37

ఓటింగ్ శాతం 80.92%