పవన్ ఖేరా బెయిల్ తీర్పు రిజర్వ్
అసోం సీఎం సతీమణి
పాస్‌పోర్టు వ్యాఖ్యలపై సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సతీమణి పాస్ పోర్టులకు సంబంధించిన ఆరోపణలపై కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం బెయిల్ పిటిషన్ కేసుపై సుప్రీంలో విచారణ జరిగింది.
ఈ సందర్భంగా పవన్ ఖేరా తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ మాట్లాడుతూ.. కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. నిర్బంధ విచారణ పేరుతో అవమానించాల్సిన అవసరం ఏముందన్నారు. ఇది పరు వు నష్టానికి సంబంధించిన అంశమని, సీఎం తాను చట్టాలకు అతీతమన్న రీతిలో ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఆయన రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యల వల్లే పవన్ ఖేరా అరెస్టుకు పోలీసులు సన్నాహాలు చేశారని ఆరోపించారు.
ఆయనపై మోపిన కొన్ని సెక్షన్ల కింద బెయిల్ పొందే అవకాశం ఉందని, మరికొన్ని సెక్షన్ల కింద అసలు అరెస్టు చేయాల్సిన అవసరమే లేదని వాదించారు. అసోం పోలీసుల తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. సీఎం సతీమణి పాస్‌పోర్టులకు సంబంధించిన నకి లీ, వక్రీకరించిన కాపీలను ఖేరా చూపించారన్నారు. ఆయన చూపించిన కాపీలన్నీ అవాస్తవమైనవని న్యాయస్థానానికి వెల్లడించారు. ఆయన పరారీలో ఉండి, వీడియోలు విడుదల చేస్తున్నారని చెప్పారు. దీంతో ఇరుపక్షాల వాద నలు విన్న సుప్రీంకోర్టు ఖేరా ముందస్తు బెయిల్ పిటిషన్ తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈ కేసులో ఇప్పటికే పవన్ ఖేరా బెయిల్ పిటిషన్‌ను గుహవాటి హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంను ఆశ్రయించారు.






