2 July, 2026 | 10:46 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ

02-07-2026 12:56 AM

బాన్సువాడ, జూలై 1 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం లయన్స్ ఇంటర్నేషనల్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో పాత బాలకృష్ణ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు.అదే విధంగా క్లబ్ నూతన సెక్రటరీగా ఖాలీద్,ట్రెజరర్గా విఠల్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

క్లబ్ పెద్దలు, సభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గానికి పదవీ బాధ్యతలు అప్పగించారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు పాత బాలకృష్ణ మాట్లాడుతూ, సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించి లయన్స్ క్లబ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని పేర్కొన్నారు. నూతన కార్యవర్గానికి పలువురు ప్రముఖులు,క్లబ్ సభ్యులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు. నూతన నాయకత్వంలో క్లబ్ మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువ కావాలని ఆకాంక్షించారు.