23 July, 2026 | 4:17 PM

ఆర్టీసీ బస్సును అడ్డుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు

23-07-2026 03:27 PM

మూసాపేట్: మండల పరిధిలోని చక్రాపూర్ గ్రామంలో గురువారం విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్టీసీ బస్సును అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ మహబూబ్నగర్ నుండి చక్రాపూర్ మీదగా దేవరకద్ర కు వెళ్లే ఆర్టీసీ బస్సు సమయానికి రావడం లేదని ఉదయం సాయంత్రం వేళ సమయానికి రాకపోవడంతో విద్యార్థులు పాఠశాల సమయానికి చేరుకోలేకపోతున్నారు అలాగే సాయంత్రం చీకటి పడ్డాక ఇంటికి వస్తున్నారని ఉదయం సాయంత్రం పాఠశాల సమయంలో బస్సును నడపాలని ఫోన్లో డిపో డిఎం తో మాట్లాడి సమయానికి బస్సు వచ్చే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అబ్దుల్లా, కందూర్ కురుమయ్య, బ్రహ్మయ్య, బోయ తిరుపతయ్య, కురువ వీరస్వామి, ప్రవీణ్ కుమార్, బోయ లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.