19 August, 2026 | 4:03 AM

పాపన్న పోరాటమే స్ఫూర్తి

19-08-2026 12:57 AM
  1. తెలంగాణలో బీసీల రాజ్యం ఏర్పాటు చేస్తాం
  2. టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాం తి): సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా మంగళవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేంద్ర కార్యాలయం లో పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భం గా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. బహుజన వర్గాల ఆత్మగౌరవం కోసం సర్దార్ స ర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు.

పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో బీసీల రాజ్యాధికారం సాధించేందుకు తెలంగాణ రాజ్యాధి కార పార్టీ నిరంతరం పనిచేస్తుందని మల్లన్న స్పష్టం చేశారు. బీసీలను రాజకీయంగా, సామాజికంగా ఏకం చేసి పాపన్న గౌడ్ కలలుగన్న బహుజన రాజ్యాన్ని తెలంగాణలో స్థాపించడమే తమ లక్ష్యమని తెలిపారు.

కార్యక్రమంలో పార్టీ క్రమశిక్షణ కమి టీ చైర్మ న్ బంధారపు నర్సయ్య గౌడ్, రాష్ట్ర కార్యద ర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్, మైనారిటీ అధ్యక్షుడు సల్మాన్, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చింటూ, యూ త్ ప్రధాన కార్యదర్శి వీరమ ల్లు అనిల్, స్టేట్ ఆఫీస్ కో ఆర్డినేటర్ లింగం యాదవ్, నాయకులు బయ్య వెంకటేష్ యా దవ్, భాను తదితరులు పాల్గొన్నారు.