కాళేశ్వరంపై విచారణ చేపట్టాలి
22-04-2026 01:56 AM
సీబీఐకి సీఎం లేఖ రాయాలి
ఎంపీ రఘునందన్‌రావు
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై అనుమతులు, నిర్మాణం, వ్యయం, ప్రతి అంశంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాయాలని ఎంపీ రఘునందన్‌రావు కోరారు. రేవంత్‌రెడ్డి సీఎంగా కేసీఆర్‌ను కాపాడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య విడదీయరాని బంధం ఉందన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.






