19 June, 2026 | 9:36 PM

కోనరావుపేటలో వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తి

19-06-2026 08:52 PM

- రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రక్రియ పూర్తి చేశాం.

 - సింగిల్ విండో డైరెక్టర్ రమేష్ రెడ్డి

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో నిర్వహించిన వరి ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా పూర్తయ్యాయని సింగిల్ విండో డైరెక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారుల సహకారం, రైతులు, హమాలీ కార్మికుల సమిష్టి కృషితో కొనుగోలు ప్రక్రియను సజావుగా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసి కొనుగోళ్లు నిర్వహించామని, ధాన్యం తరలింపు ప్రక్రియ కూడా సమర్థవంతంగా చేపట్టామని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో సీఈఓ కేశవులు, సింగిల్ విండో సిబ్బంది, రైతులు, గ్రామస్తులు, హమాలీ కార్మికులు పాల్గొన్నారు. రైతులు కొనుగోళ్లు పూర్తికావడంపై హర్షం వ్యక్తం చేశారు.