19 June, 2026 | 10:00 PM

బాధితులకు ఫోన్ల అప్పగింత

19-06-2026 08:49 PM

ఆర్మూర్,(విజయక్రాంతి): ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయినటువంటి మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్  ద్వారా సేకరించి 10 మంది బాధితులకు మొబైల్ ఫోన్లలను అప్పగించినట్లు అర్మూర్ సిఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఇందులో రెండు సంవత్సరాల క్రితం మూడు, ఏడాది క్రితం రెండు మొబైల్ లు, నెల రోజుల క్రితం పోయిన అయిదు మొబైల్ ఫోన్లను అప్పగించినట్లు పేర్కొన్నారు. తోట రాజమణి,  భాగ్యలక్ష్మి, గట్ట సత్యనారాయణ, మొగులయ్య, రాజేందర్, వినీష్ చౌహన్, ఉమాదేవి, నిషిత్ పర్వీన, గడ్డం కరుణాకర్, చిల్ల శ్రీనివాస్ లకు అప్పవించినట్లు వివరించారు.