విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్
19-06-2026 08:54 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో గల తిమ్మాపూర్ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించారు. శుక్రవారం పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో చైర్మన్ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించేందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె కోరారు.






