19 June, 2026 | 11:01 PM

దేశ ఐక్యత కోసం రాహుల్ కృషి

19-06-2026 09:06 PM

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

ములకలపల్లి,(విజయక్రాంతి): ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ దేశ ఐక్యత కోసం రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి జహీరుద్దీన్ అన్నారు. శుక్రవారం రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ములకలపల్లి మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించి, కేకు కోసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జహీరుద్దీన్ మాట్లాడుతూ.. దేశ ఐక్యత కోసం కృషి చేస్తున్న రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కొనియాడారు. జగన్నాధపురం పంచాయతీలో సర్పంచ్ కుంజా వినోద్ ఆధ్వర్యంలో, పూసుగూడెం పంచాయతీలో భూక్య పత్తిలాల్  ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.