2 May, 2026 | 10:08 PM

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

02-05-2026 08:38 PM

శ్రీరంగాపురం: వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం జానంపేట గ్రామంలో ఐకెపి, సింగిల్ విండో ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వం పలు ముఖ్య సూచనలు చేసింది. వరికి ప్రభుత్వం కనీస మద్దతు ధరగా సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ. 2389,లావు వాండ్లకు రూ.2369 నిర్ణయించింది. అదేవిధంగా సన్న వడ్లకు ఈ మద్దతు ధరపై అదనంగా రూ. 500 బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. రైతులు తమ పండించిన ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి విక్రయించుకోవాలని అధికారులు కోరారు. దళారులను ఆశ్రయించడం వల్ల నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున మధ్యవర్తులను పూర్తిగా నివారించాలని సూచించారు. కేంద్రంలో తూకం, చెల్లింపులు పారదర్శకంగా జరుగుతాయని భరోసా ఇచ్చారు.