అదనపు తరగతి గదులు ప్రారంభించిన పీఏసీ చైర్మన్ గాంధీ
కూకట్‌పల్లి, జూన్ 29 (విజయక్రాంతి): శేర్‌లింగంపల్లి నియోజకవర్గం వివి నగర్ డివిజన్ వెంకటేశ్వర నగర్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో సిఎస్‌ఆర్ నిధులతో నూతనంగా నిర్మించిన 4 గు అదనపు తరగతి గదులను సోమవారం కూకట్ పల్లి ఎంఈఓ రవీంద్ర రాజ్ తో కలిసి పిఎసి చైర్మన్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ రౌండ్ టేబుల్ ఇండి యా ఫౌండేషన్, చెన్నై షాపింగ్ మాల్ లు సంయుక్తంగా సిఎస్‌ఆర్ నిధులతో మండ ల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 4 నూత న తరగతి గదులను ప్రారంభించుకోవడం సంతోషదాయకమన్నారు.
విద్యార్థులకు ప్రా థమిక విద్య పునాది లాంటిదని, వారి బంగారు భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో విద్యనభ్యసించే విధంగా అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో ఈ తరగతి గదులను సిఎస్ ఆర్ నిధులతో నిర్మించడం జరిగిందన్నారు.
తరగతి గదుల నిర్మాణానికి నిధులు సమకూర్చిన సిఎస్‌ఆర్ ప్రతినిధులు దేవుడితో సమానం అన్నారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు సేవ చేయాలని సూచించారు. విద్యార్థినీ విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని,ఒక మంచి లక్ష్యం ఏర్పరచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, సమాజం కు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో రౌండ్ టేబుల్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు అశో క్ అగర్వాల్, అనిరుద్ సోంపల్లి, లోకేశ్వర్ రెడ్డి, అభిషేక్‌అగర్వాల్, విధిషా అగర్వాల్, దీపా శర్మ, శిశం అగర్వాల్, రీటా సభర్వాల్, తేజస్విని రెడ్డి, చెన్నై షాపింగ్ మాల్ ప్రతినిధులు శంకర్, సంజయ్,పాఠశాల హెడ్మాస్టర్ ఆంజనేయులు, నాయకులు సంజీవరెడ్డి, హరినాథ్, చంద్రమోహన్, సాగర్, సత్యనారాయణ, పాఠశాల ఉపాధ్యాయులు, తదిత రులు పాల్గొన్నారు.






