13 June, 2026 | 3:01 AM

అర్ధ శాస్త్ర విభాగంలో పి. శ్రీనివాస్‌కి పరిశోధక పట్టా

13-06-2026 01:54 AM

ముకరంపుర, జూన్ 12(విజయ క్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయంలోని విశ్వవిద్యాలయ కళలు, సామాజికశాస్ర కళాశాల లోని అర్థ శాస్త్ర విభాగంలో డాక్టరేట్ డిగ్రీ ని పరిశోధక విద్యార్థి పి. శ్రీనివాస్ కి అందజేశారు. తన పరిశోధన గ్రంథం ‘సొసైయో ఎకనామిక్ కండిషన్స్ అఫ్ అగ్రికల్చరల్ లబోరర్స్ అఫ్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్‘ పెద్దపల్లి జిల్లాలో వ్యవసాయ కార్మికుల సామాజిక - ఆర్థిక పరిస్థితులు ‘అనే అంశం తీసుకొని అర్ధ శాస్త్ర బి ఓ ఎస్ ఆచార్య వరప్రసాద్ పర్యవేక్షణలో పరిశోదన చేసి బహిరంగ మౌఖిక పరీక్షలో నిరూపించించిన గ్రందానికి డాక్టరేట్ డిగ్రీకి అర్హత సాధించినట్లు విశ్వవిద్యాల య పరీక్షల నియంత్రణ అధికారి డా.డి.సు రేష్ కుమార్ తెలిపారు.ఈ డిగ్రీకి సహకరించిన అర్ధ శాస్త్ర విభాగాధిపతి డా. కే. శ్రీవా ణికి, విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఉమేశ్ కుమార్ ,రిజిస్ట్రార్ సతీష్ కుమార్ , మరియు అధ్యాపకులకు పరిశోధక విద్యార్థి కృతజ్ఞతలు తెలియజేశారు.