29 June, 2026 | 1:34 AM

ఫ్రాన్స్‌లో వెయ్యికిపైగా మృతులు

29-06-2026 12:38 AM

రికార్డు ఉష్ణోగ్రతలతో మరణాలన్న ఆరోగ్యశాఖ

పారిస్: ఫ్రాన్స్‌లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 44 డిగ్రీల సెల్సియస్‌పైన ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం, వేడి తీవ్రత పెరగడం జూన్ 24 నుంచి 27 మధ్య వెయ్యి మంది మరణించినట్లు ఫ్రాన్స్ ఆరోగ్య సంస్థ ఆదివారం తెలిపింది. మృతిచెందిన వారిలో అత్యధికులు 85 శాతం వృద్ధులేనని పేర్కొంది.

వేడిగాలులను తట్టుకోలేక మృతిచెందినట్లు వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి తెలుస్తోందని తెలిపింది. గతేడాది కంటే ఈ ఏడాది గణనీయంగా మృతుల సంఖ్య పెరిగిందని అప్రమత్తతను జారీ చేసింది. అదే సమయంలో జర్మనీ, స్పెయిన్, బ్రిటన్, డెన్మార్క్, ఇటలీ, స్విట్జర్లాండ్‌తో సహా 16 దేశాల్లో కూడా ఉష్ణోగ్రతలు దశాబ్దాలనాటి రికార్డులను బద్దలు కొట్టాయని స్థానిక వార్తా సంస్థలు ప్రకటించాయి.