ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
- సమస్యలను పరిష్కరించి సీఎం రేవంత్ తన చిత్తశుద్ధిని చాటుకోవాలి
లేని పక్షంలో రాష్ట్ర సాధన మిలియన్ మార్చ్ తరహాలో మరో ఉద్యమానికి శ్రీకారం చుడతాం
ఉద్యోగుల జేఏసీ మహాధర్నాలో పలువురు వక్తలు
వేలాదిమంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నినాదాలతో దద్దరిల్లిన ఇందిరాపార్క్ ధర్నా చౌక్
ముషీరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఉన్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరిని వెంటనే క్రమబద్ధీకరించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను రేవం త్‌రెడ్డి ప్రభుత్వం పరిష్కరించి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని వారు పేర్కొన్నారు. లేనిపక్షంలో రాష్ట్ర సాధన కోసం మిలియన్ మార్చ్ తరహాలో మరో ఉద్యమాన్ని చేపట్టాలని వారు పిలుపునిచ్చారు.
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ చేరుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్ల కార్డులు చేత బూని నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఉద్యోగుల నినాదాలతో ధర్నా చౌక్ ప్రాంతమం తా దద్దరిల్లింది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు పులి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శులు శ్రీధర్, శ్రీనివాస్, సంతోష్, బాలకృష్ణారెడ్డి, జగదీష్, విజయ లక్ష్మి, సంధ్యల నేతృత్వంలో పెద్ద ఎత్తున మహాధర్నాను నిర్వహించారు.
ఈ మహాధర్నాలో తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదం డరాం, బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ జేఏసీ వైస్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బిఆర్ టియు రాష్ట్ర అధ్యక్షుడు జి. రాంబాబు యా దవ్, తెలంగాణ జన సమితి గ్రేటర్ అధ్యక్షుడు నరసయ్య, తెలంగాణ ఎరుకల సంఘ సం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లోకిని రాజు తదితరులు హాజరై మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు ప్రొఫె సర్ ఏ. కోదండరాం, అంజి రెడ్డిలు మాట్లాడుతూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల న్యాయ మైన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేట్లు కృషి చేస్తామని అన్నా రు. సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఉద్యోగు లకు అండగా ఉంటామని పేర్కొన్నా రు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ గత బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జరిగిన అన్యాయంలో తనకు కూడా భాగస్వామ్యం ఉందని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు క్షమించాలని కోరు తూ శిరస్సు వంచి కోరుతున్నట్లు ఆమె విజ్ఞ ప్తి చేశారు.
రాష్ట్రంలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానాలు లేకుండా పర్మినెంట్ ఉద్యోగుల ప్రతి ఒక్కరిని గుర్తించాలని ఆమె డిమాండ్ చేశా రు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు మీ న్యాయమైన సమస్యలు పరిష్కా రం అయ్యేంత వరకు ఐక్య ఉద్యమ పోరాటాలు చేపట్టాలని త్వరలోనే జాగృతి ఆధ్వర్యంలో కొత్త పార్టీ ఏర్పడుతుందని, ఎన్నికల తర్వాత తాము అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాలు లేకుం డా చర్యలు చేపడ తామని ఆమె హామీ ఇచ్చారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న ఔట్ సోర్సిం గ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఇందు కోసం ఇతర రాష్ట్రాల మాదిరిగా ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసి నేరుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీల పేరుతో దళారులకు ప్రతి సంవత్సరం వంద ల కోట్లు దోచిపెడుతుందని ఆయన ఆరోపించారు. ఏజెన్సీ వ్యవస్థను రద్దుచేసి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు.
ప్రభుత్వం ఉద్యోగులకు ఒక రకంగా, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగు లకు ఇంకొకరకంగా వేతనాలు చెల్లించి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం వెట్టి చేయించుకుంటుందన్నారు, పిఆర్సిల మీద పిఆర్సిలు వేసి ఉద్యోగుల జీతభత్యాలను, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు పెంచిన ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను ఎందు కు పెంచడం లేదని ఆయన ప్రశ్నించారు.
ప్రతి శాఖలో ఔట్‌సోర్సింగ్ ప్రతిపదికగా ఉద్యోగాలు చేస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం గత 9 నెలలుగా వేతనాలు కూడా ఇవ్వడం లేదని, దీనితో రాష్ట్రంలోని ఐదు లక్షల మం ది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలు రో డ్డున పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సందర్భం గా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన స్వామి మేరకు తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించి, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచాలని, ఆరోగ్య భద్రత తో పాటు ప్రతినెల జీతాలు విడుదల చేయాలని అలా గే అకారణంగా అన్యాయంగా తొలగించిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగు లను విధుల్లోకి తీసుకోవా లని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో కలిసి వేలాది మందితో చలో అసెంబ్లీ ముట్టడిని చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ కమిటీ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ ప్రధాన కార్యదర్శి దొయిపాడి శ్రీధర్ దుర్గం శ్రీనివాస్ కోశాధికారులు సంతోష్ కుమార్ ఎం జగదీష్ వర్కింగ్ ప్రెసిడెంట్లు బీ గోవర్ధన్, ఎస్. సురేందర్ గౌడ్, మహమ్మద్ రాజమ్మద్, ఎం. బాలకృష్ణారెడ్డి, పద్మ జ్యోతి, సురేష్ నాయక్, రవి కిరణ్, క్రాంతి కుమార్‌ల తోపాటు వేలాదిమంది ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.




