30 March, 2026 | 1:55 AM

ప్రభుత్వ భూమిగా నిర్ధారించి నివేదికను ఇచ్చిన అధికారులు

30-03-2026 12:04 AM

విజయక్రాంతి ఎఫెక్ట్ 

అలంపూర్, మార్చి 29: రాజోలి మండలం పచ్చర్ల గ్రామ శివారులోని సర్వే నంబర్ 4/2 ఉ న్న గ్రామ దేవత మహాలక్ష్మి దేవి అమ్మ వారికి చెందిన భూమి వివాదాస్పదంగా మారిన సంగతి విధితమే. గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకునికి అధికారులు వత్తాసు పలుకుతూ పలు రకాల తప్పుడు సర్వేలు చేయిస్తుండడంతో సదరు వ్యక్తి పై పలు అనుమానాలకు తావిస్తోందని గతంలో గ్రామంలో కొందరు ఆరోపించారు. ఇట్టి భూమిపై ఆ వ్యక్తి కబ్జాకు పూనుకునట్లు గ్రామంలో కొందరు అధికారులకు పలు రకాల ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదన్నారు.

అయితే ఈ భూమి వివాద అంశంపై ఈనెల 1న గ్రామ దేవత గుడి స్థలంపై అంతు చిక్కని అధికారుల వైఖరి అనే కథనాన్ని విజయక్రాంతి దిన పత్రికలో ప్రచురించింది . కథనానికి స్పందించిన రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు వివాదాస్పదంగా మారిన భూమిపై చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి సర్వే నిర్వహించి మొత్తం 2.4 ఎకరాల భూమిలో సుమారు.0.08 సెంట్ల ఖాళీగా ఉన్న భూమిని ప్రభుత్వ స్వాధీనంలో ఉన్నట్లు గుర్తించారు.అట్టి ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న భూమిపై పంచనామా నిర్వహించినట్లు నివేదికలో పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలంగా గ్రామపంచాయతీకి ఇవ్వడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.