3 July, 2026 | 10:21 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

విద్యార్థి మృతిపై ఆగ్రహం.. పాఠశాలలు బంద్

09-10-2025 12:00 AM

నంగునూరు, అక్టోబర్ 8:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డ లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న సనాదుల వివేక్ (13) మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దసరా సెలవుల అనంతరం పాఠశాలకు వచ్చిన ఒక్క రోజులోనే ఈ విషాదం చోటుచేసుకోవడంతో వివేక్ స్వగ్రామమైన నంగునూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఈ ఘటన నేపథ్యంలో నంగునూరు యువత బుధవారం నంగునూర్,గట్లమల్యాల జిల్లా పాఠశాల,మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలతో పాటు అక్కేనపల్లి మోడల్ స్కూల్లను బంద్ పాటించి తమ నిరసనను తెలియజేశారు.మృతికి కారణమైన అంశాలను దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ  పాఠశాల ప్రధానౌపాధ్యాయులు,ఉపాధ్యాయుల నిర్లక్ష్యాన్ని నిరసన వ్యక్తం చేశారు.సమగ్ర విచారణ జరిపి,మరణానికి గల అసలు కారణాలు తెలపాలని, న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.