3 July, 2026 | 11:15 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

బాంబ్, నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌లతో విస్తృత తనిఖీలు

09-10-2025 12:00 AM

తూప్రాన్, అక్టోబర్ 8: మెదక్ జిల్లా ఎస్పీడి.వి.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ముఖ్యంగా బస్ స్టేషన్, దాబాలు, హోటళ్లు, పాన్ షాపులతో పాటు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో యాంటీ సబోటేజ్, నార్కోటిక్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో బాంబ్ స్క్వాడ్, నార్కోటిక్ డాగ్ బృందాలు పాల్గొని ప్రతి మూలను పరిశీలించాయి. ప్రజల భద్రతను కాపాడటం, నేరాలను అరికట్టడం అలాగే అక్రమ మాదకద్రవ్యాల రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీసులు 24 గంటలు ప్రజల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారని, ప్రజల సహకారం అత్యంత అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఎస్‌ఐ జ్యోతి, ఏఎసై శ్రీనివాస్, డాగ్ స్క్వాడ్ శ్రావణ్, బాంబ్ స్క్వాడ్ సిద్దిరాములు, సిబ్బంది పాల్గొన్నారు.