27 July, 2026 | 6:33 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

మాదిగ ఉద్యోగులు వేలాదిగా తరలిరండి

06-03-2026 12:12 AM

పిలుపునిచ్చిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

ధర్మపురి,మార్చి5(విజయక్రాంతి ):ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి మాదిగ కులస్తులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో న్యాయం జరిగే విధంగా కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సన్మాన సభకు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే మాదిగ ఉద్యోగులంతా వేలాదిగా తరలి రావాలని రాష్ట్ర సాంఘి క సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.

నేడు మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబా ద్ లోని హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో తెలంగాణ రాష్ట్ర మాదిగ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తో పాటు తెలంగాణ రాష్ట్ర మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు హాజరవుతున్నట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మాదిగ ఉద్యోగులు వేల సంఖ్యలు తరలివచ్చి ముఖ్యమంత్రి సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.