ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు అభినందనీయం
మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు, డీస్పీ శ్రీనివాస్ రెడ్డి
కోదాడ ,ఏప్రిల్ 6 : స్వర్ణ భారతి ట్రస్ట్ సభ్యులు పేదలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ, వెంకటరత్నం బాబు, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి లు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు రాయపూడి వెంకటనారాయణ సౌజన్యంతో వారి తల్లిదండ్రులు రాయపూడి నాగేశ్వరరావు, ఉదయలక్ష్మి, కూతురు హిమబిందుల జ్ఞాపకార్థం యశోద హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నీలా సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చారుగండ్ల ప్రవీణ, రాజశేఖర్, స్థానిక కౌన్సిలర్ మాలోత్ చైతన్య నాయక్, 8వ వార్డు కౌన్సిలర్ రామిశెట్టి ఉదయశ్రీ, హరిప్రసాద్,సైదా నాయక్, సభ్యులు కాలంగి వెంకటేశ్వర్లు, బుజ్జయ్, జగనీ ప్రసాద్, వెంపటి ప్రసాద్, బండారు శ్రీనివాసరావు, సాయి, హెచ్‌ఎం నిగిడాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.




