ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలి
కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర స్థాయి గ్రీవిన్స్ లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిష్కరించాలన్నారు.
ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా కలెక్టరేట్ లోని ప్రతి కార్యాలయం పరిశుభ్రంగా ఉంచుకోవాలని అలాగే ప్రతి కార్యాలయంలోని ఫైల్స్ అన్ని సక్రమంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి కార్యాలయ సిబ్బంది అటెండెన్స్ తప్పనిసరిగా ఫేస్ రికగ్నేషన్ యాప్ లో నమోదు చేయాలని, కలెక్టరేట్ లోని ప్రతి కార్యాలయంలో ఫైల్స్ సరిగా లేకపోయినా, శుభ్రంగా ఉండని కార్యాలయాలపై చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో భూ సమస్యలకి సంబందించి 28 దరఖాస్తులు, మున్సిపాలిటీ 6, డిఆర్డిఏ 4, డిపిఓ 4, వివిధ శాఖలకు సంబంధించి 20 దరఖాస్తులు రాగా మొత్తం 58 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కే సీతారామా రావు, సీఈఓ జడ్పీ శిరీష ఆర్డీవో వేణు మాధవరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.




