1 March, 2026 | 4:34 AM

సందీప్ సరసన!

01-03-2026 12:40 AM

ఢిల్లీ సుందరి రితికా నాయక్ ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ చిత్రంతో తెలుగు చిత్రసీమలో ఎంట్రీ ఇచ్చింది. ‘హాయ్ నాన్న’ సినిమాలో క్ల్లుమాక్స్‌లో కనబడి ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత ‘మిరాయ్’లో తేజ సజ్జా సరసన హీరోయిన్‌గా అలరించిన ఈ భామ ఒక్కసారిగా టాలీవుడ్ సినీప్రియులకు క్రేజీ బ్యూటీగా మారిపోయింది. ఆ సినిమాలో అందం, అభినయంతో కుర్రాళ్లను సైతం ఆకట్టుకోవటం ద్వారా కెరీర్ పరంగా ముందడుగు వేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస అవకాశాలు అందుకుంటోంది.

రితికా ఇప్పుడు ‘డ్యూయెట్’, ‘కొరియన్ కనకరాజు’ సినిమాల్లో నటిస్తోంది. తాజాగా మరో ఛాన్స్ ఈ అమ్మడి తలుపు తట్టినట్టు తెలుస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్‌లలో వరుస ప్రాజెక్టులు చేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్.. ఈ ఏడాది ఓ పొలిటికల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘పవర్‌పేట’ పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలోనే రితికా నాయక్ కథానాయికగా ఎంపికైనట్టు సమాచారం. ‘రౌడీ ఫెలో’, ‘చల్ మోహన్ రంగ’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కృష్ణచైతన్య ఈ సినిమాను తెరకె క్కిస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా నుంచి త్వరలోనే అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది.