19 August, 2026 | 11:37 AM

అంత్యక్రియలకు ఆర్థిక సాయం చేసిన ఎంఎస్ఆర్

19-08-2026 10:31 AM

హన్వాడ :  మండల కేంద్రానికి చెందిన గర్క శంకర్ గౌడ్ మరణించిన విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న మహబూబ్ నగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వ విప్ యేన్నం శ్రీనివాస్ రెడ్డి  ఆధ్వర్యంలో  వారి అంత్యక్రియలకు ఆర్థిక సాయంగా రూ 10వేల ను వారి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇస్నాతి సుధాకర్,కాంగ్రెస్ పార్టీ మైనార్టీ జిల్లా కన్వీనర్ షబ్బీర్ హుస్సేన్,మాజీ సర్పంచ్ సత్యం,ఉప సర్పంచ్ అంజమ్మ రాములు,దాసరి వెంకటయ్య,మంతటి రాములు, బైకని వెంకటేష్ తదితరులు ఉన్నారు.