వేసవి క్రీడా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
12-05-2026 01:08 AM
మఠంపల్లి, మే 11: మండలంలోని మోడల్ స్కూల్ లో నిర్వహించే వేసవి క్రీడా శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మఠంపల్లి తాహశీల్దార్ లావురి మంగా, సర్పంచ్ ఏసుమల్ల వీరలక్ష్మి పాపయ్యలు అన్నారు. సోమవారం మోడల్ స్కూల్ లో ఏర్పాటుచేసిన శిబిరాన్ని అధికారులతో కలిసి ప్రారంభించి మాట్లాడారు.
15 రోజులపాటు నిర్వహించే ఈ శిబిరంలో 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు వివిధ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు హార్మోనియం, చెస్, యోగా, ఎలక్ట్రిక్, ఇండోర్ గేమ్స్,క్యారమ్స్ ఇతర ఆటలకు శిక్షణ తెలిపారు. మే 11నుండి 26వ తారీఖు వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివ, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






