ఎగ్లాస్ పూర్ పాఠశాలలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం
మంథని,మే11 (విజయ క్రాంతి) మంథని మండలం ఎగ్లాస్ పూర్ గ్రామంలోని పి ఎం ఎస్ హెచ్ ఆర్ ఐ జడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో సోమవారం సమ్మర్ క్యాంప్ కార్యక్రమం ప్రారంభించారు. గ్రామ పరిసర ప్రాంతాల విద్యార్థుల సౌకర్యార్థం ఈ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి జ్యోతి తెలిపారు. అలాగే వాకింగ్ ట్రాక్ మార్గాన్ని మంథని ఎంఈఓ దాసరి లక్ష్మి ప్రారంభించారు.
ఈ సమ్మర్ క్యాంపు కార్యక్రమంలో ఆటలు, నృత్యాలు, పాటలు, సంగీతం నేర్పుటకు కళాకారిణి డ్యాన్స్ మాస్టర్ కుమారి పిల్లలకు డ్యాన్స్ లో శిక్షణ ఇవ్వనున్నారు.గ్రామ ప్రజలు నడక చేయుటకు వాకింగ్ ట్రాక్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముత్తారం ఎంఈఓ ఎన్ హరిప్రసాద్, గ్రామ సర్పంచ్ బి రజిత, ప్రధానోపాధ్యాయులు సహోపాధ్యాయులు వి జ్యోతి, ఎం అనిత, మంథని రాజశేఖర్, ములుకల్ల రాజశేఖర్, జె మంజుల, డాన్స్ మాస్టర్ ఆకాంక్ష తోపాటు వార్డు సభ్యులు,విద్యార్థులు పాల్గొన్నారు.






