నిర్దేశిత లక్ష్య సాధనకు కృషిచేయాలి
ఆర్‌కే 5 సమీక్షా సమావేశంలో జీఎం శ్రీనివాస్
నస్పూర్, ఏప్రిల్ 30: సింగరేణి సంస్థ మనుగడే లక్ష్యంగా, ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశిత లక్ష్య సాధనకు ప్రతీ ఒక్కరు కలిసికట్టుగా కృషిచేయాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం ఆర్ కే 5 భూగర్భ గనిలో రక్షణతో కూడిన ఉత్పత్తి సాధనే లక్ష్యంగా ఆర్ కే 5 అధికారులు, సేఫ్టీ కమిటీ, మైన్ కమిటీ, మైనింగ్ స్టాఫ్, సూపర్వైజర్లతో నిర్వహించిన క్షేత్రస్థాయి సమీక్ష సమావేశంలో జీఎం మాట్లాడారు.
పవర్ పాయింట్ ద్వారా డీజీఎం(ఐఈడీ) రాజన్న 2025-26 ఆర్థిక సంవత్సరం సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం సాధించిన ఉత్పత్తి వివరాలతో పాటు ఉద్యోగులు, పనిముట్లు, యంత్రాల వినియోగం ఇతరత్ర లోటు పాట్లు వివరాలు వివరించారు.అందరూ కలిసికట్టుగా నిర్ధిష్ట గంటలు యంత్రాలు వినియోగిస్తూ ప్రోడక్షన్ టార్గెట్ సాధిస్తేనే అధి సాధ్యమన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రూప్ ఏజెంట్ శ్రీధర్, గని మేనేజర్ సుధీర్ కుమార్ ఝా, గుర్తింపు సంఘం బ్రాంచి సెక్రటరీ బాజీ సైద, గ్రూప్ ఇంజనీర్ భట్టాచార్య, డీజీఎం(ఐఈడీ) రాజన్న, సేఫ్టీ ఆఫీసర్ శివయ్య, పిట్ సెక్రెటరీ నర్సింగ్ రావ్, అసిస్టెంట్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.






