1 May, 2026 | 10:41 AM

ట్రాఫిక్ నిబంధనలపై బాధ్యతగా వ్యవహరించాలి

01-05-2026 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 30(విజయక్రాంతి): ట్రాఫిక్ నిబంధనల పట్ల వాహనదారులు బాధ్యతగా వ్యవహారించాలని జిల్లా రవాణా శాఖ అధికారి రామచందర్ పేర్కొన్నారు. రవాణా శాఖ వారోత్సవాల్లో భాగంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం, ట్రాఫిక్ నిబంధనల పట్ల బాధ్యత కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు.

జిల్లా కేం ద్రంతో పాటు వివిధ మండలాల్లో రవాణా శాఖ అధికారులు ప్రత్యేక అవగాహన ర్యాలీలు, సమా వేశాలు, డ్రైవర్లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. విద్యార్థులు, యువతలో ట్రాఫిక్ నియమాలపై చైతన్యం కల్పించేందుకు పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. వాసవి క్లబ్ అధ్యక్షుడు ఉదయ్ బాబు మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగించాలని సూచించారు.

ఈ సందర్బంగా ట్రాఫిక్ నిబంధనలు పాటి స్తామని వాహనదారులతో డిటిఓ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం రవాణా శాఖ అధికారులు, సిబ్బ ందికి వాసవి క్లబ్ సభ్యులు శాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంవిఐ మోహన్, ఏఎంవిఐ రాజమల్లు, క్లబ్ కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి శ్రీధర్ పాల్గొన్నారు.