4 May, 2026 | 3:52 AM

ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలి..

04-05-2026 02:36 AM

మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి

మెదక్, మే 3 (విజయ క్రాంతి) :ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయడం ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక కర్తవ్యమని మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మా దేవేందర్రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని షాదీఖానాలో బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులను పద్మ దేవేందర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హజ్ యాత్ర ముస్లింలకు అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుందని, అల్లాహ్కు మరింత దగ్గరయ్యే అవకాశం ఈ యాత్ర ద్వారా లభిస్తుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది పలు మంది ముస్లింలు హజ్ యాత్రకు వెళ్తున్నారని, ఇది జిల్లాకు గర్వకారణమని అన్నారు.

యాత్రలో శారీరక, మానసిక సిద్ధతతో పాటు క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని సూచించారు. హజ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని సురక్షితంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మౌలానా జావీద్ అలీ, ఖాజీ మొయిజ్, ముఫ్తీ సాబేర్, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిండ్ల. ఆంజనేయులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కిరెడ్డి కృష్ణారెడ్డి, కో కన్వీనర్లు గడ్డమీది కృష్ణ గౌడ్, లింగారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ లు జుబెర్ అహ్మద్, సోహెల్, బట్టి ఉదయ్ కుమార్, దీపక్ కుమార్, మాజీ కౌన్సిలర్ మాయ మల్లేశం, భీమరి కిషోర్, నాయకులు హామీద్, సాదిక్ అలీ, ఫాజిల్, ఇందాద్, ఇస్మాయిల్, మహమ్మద్, ఫరూక్, అమీర్, సర్దార్, సాయి కుమార్, వనం లత తదితరులు పాల్గొన్నారు.