సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవాలి
02-08-2026 12:23 AM
బాసర త్రిబుల్ ఐటీలో మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి
నిర్మల్, ఆగస్టు 1 ( విజయక్రాంతి): బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులు సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర మాజీ డీజీపీ, టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నా రు. శనివారం నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్ ఐటీని ఆయన సందర్శించారు. మొదటి సంవత్సరం పీఈసీ విద్యార్థులకు నిర్వహిస్తున్న ఓరియంటేషన్ క్లాస్‌లను సందర్శించి మాట్లాడారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఐటీ రంగంతో పోటీపడుతున్న నేపథ్యంలో శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని అందిపు చ్చుకొని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాసర త్రిబుల్ ఐటీ వైస్ ఛాన్సలర్ గోవర్ధన్, అధ్యాపకులు, ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.






