పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే ప్రాణాంతక వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
డీఎంహెచ్‌ఓ
సూర్యాపేట, మే 31(విజయక్రాంతి) : పొ గాకు ఉత్పత్తుల వల్ల కలిగే ప్రాణాంతక వ్యా ధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పెండెం వెంకటరమణ అన్నారు. ఆకర్షణల ముసుగును తొ లగించి.. పొగాకు వ్యసనాన్ని అడ్డుకుందాం అనే నినాదంతో సూర్యాపేట పట్టణలోని అంబేద్కర్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రంగురంగు ల ప్యాకేజింగ్, సువాసనలతో కూడిన ఫ్లేవర్డ్ సిగరెట్లు, ఇ-సిగరెట్ల వంటి ఆధునిక రూపాలతో యువత, పిల్లలు ఆకర్షితులై వ్యసనా నికి బానిసలవుతున్నారన్నారు.
సిగరెట్లు, బీ డీలు, గుట్కా, ఖైనీ, జర్దా వంటి పొగాకు ఉ త్పత్తులను నమలడం, ధూమపానం చేయ డం వల్ల నోటి క్యాన్సర్, ఊపిరిత్తుల క్యాన్సర్, గుండెపోటు, పక్షవాతం, తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు వస్తాయన్నారు. ముఖ్యంగా పాసి వ్ స్మోకింగ్ వల్ల గర్భిణులు, చిన్న పిల్లలు తీవ్ర ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారన్నారు. విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయని, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. పొగాకు వ్యసనం నుండి బయటపడాలనుకునే వారి కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ‘టొబాకో సెసేషన్ సెంటర్స్’ ద్వారా ఉచిత కౌన్సెలింగ్, మందు లు అందిస్తున్నామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ డిఎంహెచ్‌ఓ గాజుల చంద్ర శేఖర్, టిబి యూనిట్ ఆఫీసర్ డా. పి. వెంకట పాపిరెడ్డి, పిహెచ్సి వైద్యాధికారి డా. అమూల్య, డిప్యూటీ డెమో వి. సం జీవ్ రెడ్డి, సిహెచ్‌ఓ శ్రీనివాస రాజు, వైద్య సిబ్బంది,ఆశ కార్యకర్తలు తదితరు పాల్గొన్నారు.






