ఖర్గేతో సీఎం, కాంగ్రెస్ నేతల భేటీ
- శంషాబాద్ విమానాశ్రయంలో కలసిన నాయకులు
- రాష్ట్ర రాజకీయాలపై చర్చ
హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): హైదరాబాద్ మీదుగా గుల్బర్గా వెళ్లిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ను సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు శం షాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలిశారు. సీఎంతోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు కలిశారు.
నోవాటేల్ హోటల్‌లో ఖర్గేతో మహేశ్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా భేటీ అయినట్లు సమాచారం. ఇటీవల గాంధీ భవన్‌లో జరిగిన టీపీసీసీ పీఏసీ సమావేశం వివరాలను ఖర్గేకు వివరించారు. అదేవిధంగా ఎస్‌ఐఆర్‌పై రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఖర్గేకు ఆయన వివరించినట్లు తెలిసింది. దీం తోపాటు రాష్ట్ర రాజకీయాలపైన ఖర్గేతో కాం గ్రెస్ నేతలు చర్చించినట్లు తెలిసింది. రాష్ట్రం లో పార్టీ బలోపేతానికి నేతలు మరింత కృషి చేయాలని ఖర్గే సూచించినట్లు తెలిసింది.






