18 May, 2026 | 8:25 PM

బంగారం కోసం వృద్ధురాలి హత్య

29-12-2025 12:20 AM

ఎల్లారెడ్డి, డిసెంబర్ 28:(విజయక్రాంతి): ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన లింగంపేట మండలం పోల్కంపేటలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన లింగంపేట మండలం పోల్కంపేటలో  శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. లింగంపేట పోలీసులు  తెలిపిన వివరాల ప్రకారం.. పోల్కంపేట గ్రామానికి చెందిన నరేంద్రుల సులోచన (75)కు ఇద్దరు కుమారులున్నారు.

వంతులో భాగంగా వారంరోజుల క్రితం ఆమె పెద్ద కుమారుడు రాజుల వద్దకు వెళ్లింది. అయితే రాజుల కుటుంబం మూడు రోజుల క్రితం తీర్థయాత్రకు వెళ్లింది. ఇంట్లో ఆమె ఒకతే ఉందని పసిగట్టిన దుండగుడు శుక్రవారం రాత్రి ఆమెను తీవ్రంగా కొట్టి హత్య చేసి ఆమెపై ఉన్న నాలుగు తులాల బంగారు ఆభరణాలను  దోచుకెళ్లాడు. అందులో ఒక పుస్తెలతాడు, కమ్మలు, వంక ఉంగరం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.