18 July, 2026 | 12:07 PM

Breaking News

విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •   సోనమ్ వాంగ్‎చుక్ దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు   •  

వెనిజులా నుంచి భారత్‌కు చమురు

23-05-2026 12:28 AM

దేశానికి మూడో అతిపెద్ద చమురు సరఫరాదారు

న్యూఢిల్లీ, మే ౨౨: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి మూతపడింది. దీంతో భారత్ ప్రత్యామ్నా య మార్గాల ద్వారా చమురు సేకరిస్తున్నది. దీనిలో భాగంగానే చమురు దిగుమతికి వెనిజులా వైపు మొగ్గుచూపింది. మొదట సాధా రణంగా ప్రారంభమైన దిగుమతి క్రమంగా పెంచుకుంటూ వచ్చింది. అది ఎంతగా అంటే.. ఇప్పుడు భారత్‌కు చమురు సరఫరా చేసే దేశాల్లో వెనిజులా మూడోస్థానానికి చే రుకుని సౌదీ అరేబియా, అమెరికా దేశాలను సైతం వెనిజులా వెనక్కి నెట్టింది.

భారత్‌కు ఒక ఈ నెలలోనే వెనిజులా నుంచి సుమారు ౪.౧౭ లక్షల బ్యారెళ్ల ముడి చమురు (క్రూడ్ ఆయిల్)ను దిగుమతి చేసుకోవడం గమనార్హం. ఏప్రిల్ నెలతో పోలిస్తే ఆ దిగుమతి ౪౭శాతం ఎక్కువ. రష్యా చమురుతో పోలిస్తే వెనిజులా ముడి చమురు చాలా తక్కువ ధర కు లభించడం మరో విశేషం.