2 September, 2026 | 10:24 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

మైసా కోసం సాహసాలు!

30-04-2026 | 02:03am

స్టార్ బ్యూటీ రష్మిక మందన్న మరోసారి నటన పట్ల తనకున్న అంకితభావాన్ని నిరూపించుకున్నారు. ‘మైసా’ సినిమా కోసం ప్రాణాలకు తెగించి సాహసాలు చేస్తోందీ నేషనల్ క్రష్. దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలోని ఒక కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌ను ఇటీవల కేరళలోని ప్రసిద్ధ అతిరపల్లి జలపాతం వద్ద చిత్రీకరించారు. ఈ సందర్భంగా రష్మిక సుమారు 80 అడుగుల ఎత్తు నుంచి ఎలాంటి డూప్ సహాయం లేకుండా కిందకు దూకారు.

ఈ సమయంలో ఆమె కాళ్లు, చేతులకు గాయాలై, రక్తం వస్తున్నప్పటికీ, ఆమె వెనకడుగు వేయకుండా, ప్రాథమిక చికిత్స తీసుకున్న వెంటనే తిరిగి షూటింగ్‌లో పాల్గొనడం చిత్ర యూనిట్‌ను విస్మయానికి గురిచేసింది. ప్రముఖ అంతర్జాతీయ స్టంట్ మాస్టర్ కెచా ఖంపక్డీ పర్యవేక్షణలో బ్యాంకాక్‌లో వారం పాటు ప్రత్యేక శిక్షణ పొందిన రష్మిక  మార్షల్ ఆర్ట్స్, గిరిజన పోరాట పద్ధతులను నేర్చుకున్నారు. ఈ చిత్రంలో రష్మిక గోండ్ తెగకు చెందిన ఒక శక్తిమంతమైన మహిళగా కనిపించను న్నారు. 1940ల కాలం నాటి నేపథ్యంలో సాగే ఈ కథలో ఆమె పాత్ర పేరు ‘మైసా’.